Covid 19: దేశంలో కొత్తగా 7946 కేసులు నమోదు, మరో 62,748 కేసులు యాక్టివ్‌, గత 24 గంటల్లో 9828 మంది డిశ్చార్జ్

దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

దేశంలో బుధవారం 7231 పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు కొత్తగా 7946 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని, మరో 37 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.98 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.14 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.67 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా 212.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.