Dal Lake Houseboat Fire: దాల్ సరస్సు వద్ద ఘోర అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన రెండు హౌస్‌బోట్‌లు, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని తెలిపిన అధికారులు

శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో రెండు హౌస్‌బోట్‌లు దగ్ధమయ్యాయి. దాల్‌ సరస్సు వద్ద మంటలు చెలరేగడంతో న్యూజిలాండ్‌, అపోలో xI అనే రెండో హౌస్‌బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Fire| Representational Image (Photo Credits: Pixabay)

శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో రెండు హౌస్‌బోట్‌లు దగ్ధమయ్యాయి. దాల్‌ సరస్సు వద్ద మంటలు చెలరేగడంతో న్యూజిలాండ్‌, అపోలో xI అనే రెండో హౌస్‌బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇతర హౌస్‌బోట్‌లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. స్థానిక దేవదారుతో చేసిన ఈ హౌస్‌బోట్‌లు దాల్ సరస్సులో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫ్లోటింగ్ ప్యాలెస్‌లుగా పిలిచే ఈ హౌస్‌బోట్‌లు వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement