Dalit Girl Rape-Murder in Ayodhya: కూతుళ్లను రక్షించలేని ఈ పదవి నాకెందుకు, అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై భోరున విలపించిన ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ భోరున విలపించారు. ‘నన్ను ఢిల్లీకి వెళ్ళనివ్వండి. ప్రధాని మోదీ ముందు ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా. న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ భోరున విలపించారు. ‘నన్ను ఢిల్లీకి వెళ్ళనివ్వండి. ప్రధాని మోదీ ముందు ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా. న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా. కూతుళ్లను రక్షించడంలో మనం విఫలమవుతున్నాం. చరిత్ర మనల్ని ఎలా భావిస్తుంది? మన కూతురికి ఇది ఎలా జరిగింది?. మర్యాద పురుషోత్తమ రామ.. తల్లి సీత, మీరు ఎక్కడ ఉన్నారు?’ అంటూ బోరున విలపించారు.
అయోధ్యలో కాళ్లు విరిచి, కంటి గుడ్లు పెకలించిన 22 ఏళ్ల దళిత మహిళ నగ్న మృతదేహాన్ని కాలువలో శనివారం పోలీసులు గుర్తించారు.ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు.పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అన్నది నిర్ధారిస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Ayodhya MP Awadhesh Prasad cries inconsolably over alleged rape, murder of Dalit woman
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)