DCW Chief Swati Maliwal Resigns: పదవికి రాజీనామా చేస్తూ తోటి ఉద్యోగులను హత్తుకుని భావోద్వేగానికి గురైన స్వాతి మలివాల్‌, ఆప్ నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన స్వాతి

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ (Delhi Womens Panel Chief) స్వాతి మలివాల్‌ (Swati Maliwal) తన పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.తోటి ఉద్యోగులను హత్తుకొని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.

DCW Chief Swati Maliwal (Photo Credit: Twitter/@SwatiJaiHind)

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ (Delhi Womens Panel Chief) స్వాతి మలివాల్‌ (Swati Maliwal) తన పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.తోటి ఉద్యోగులను హత్తుకొని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. స్వాతి మలివాల్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిగా నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాతి.. డీసీడబ్ల్యూ పదవికి రాజీనామా (resign) చేశారు.

ఈ సంవత్సరం 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కాబోతోంది. అందులో ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తా, సుశీల్‌ కమార్‌ గుప్తాలు కూడా ఉన్నారు.ఈ ముగ్గురు నేతల ఆరేళ్ల పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది.ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు ఆప్‌ ముగ్గురు అభ్యర్థులను నామినేట్‌ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీలుగా పదవీ విరమణ చేయనున్న ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తాలను రాజ్యసభకు నామినేట్‌ చేస్తున్నట్లు ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (political affairs committee) శుక్రవారం ప్రకటించింది.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)