Dengue Cases in Delhi: ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ ఫీవ‌ర్, కేవ‌లం ఐదు రోజుల్లో 321 కేసులు, 1258కు చేరిన మొత్తం డెంగీ ఫీవ‌ర్ కేసులు

దేశ రాజ‌ధాని ఢిల్లీని డెంగీ ఫీవ‌ర్ వణికిస్తోంది. అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వ‌ర‌కు కేవ‌లం ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే ఢిల్లీ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో 321 మందికి డెంగీ ఫీవ‌ర్ సోకింది.

Image used for representational purpose | (Photo Credits: Wikimedia Commons)

దేశ రాజ‌ధాని ఢిల్లీని డెంగీ ఫీవ‌ర్ వణికిస్తోంది. అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వ‌ర‌కు కేవ‌లం ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే ఢిల్లీ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో 321 మందికి డెంగీ ఫీవ‌ర్ సోకింది. ఇక సెప్టెంబ‌ర్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు మొత్తం 693 మంది డెంగీ బారినప‌డ్డారు.ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు మొత్తం 1258 మందికి డెంగీ ఫీవ‌ర్ సోకింది. అయితే డెంగీ బారినప‌డిన బాధితులంతా కోలుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాక‌పోవ‌డం సంతోష‌క‌ర‌మైన ప‌రిణామం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement