Delhi: వీడియో ఇదిగో, ఆకాశంలో ఉండగా ఒక్కసారిగా ఆగిపోయిన ఊయల చక్రం, మమ్మల్ని కాపాడండి అంటూ 50 మంది అరుపులు కేకలు

ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన నవరాత్రి మేళాలో సాంకేతిక లోపంతో ఫెర్రిస్ వీల్ (జెయింట్ వీల్) రైడ్‌లో చిక్కుకుని సుమారు 50 మంది విలవిలాడారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక సిబ్బంది మరియు ఇతరుల సహాయంతో ప్రజలను రక్షించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చక్రం తిరగడం ఆగిపోయింది.

Visuals from the spot. (Photo Credit: ANI)

ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన నవరాత్రి మేళాలో సాంకేతిక లోపంతో ఫెర్రిస్ వీల్ (జెయింట్ వీల్) రైడ్‌లో చిక్కుకుని సుమారు 50 మంది విలవిలాడారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక సిబ్బంది మరియు ఇతరుల సహాయంతో ప్రజలను రక్షించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చక్రం తిరగడం ఆగిపోయింది. పై బోనులో ఉన్న వ్యక్తులు సుమారు అరగంట పాటు అక్కడ చిక్కుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఊయల చక్రం పనిచేయడం ఆగిపోయిందని పోలీసులు తెలిపారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని వారు తెలిపారు. నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now