Delhi Air Pollution: ఢిల్లీ వాసులకు పొంచి ఉన్న అనారోగ్య ముప్పు, ప్రమాదకరంగా మారుతున్న గాలి కాలుష్యం, 322 నుంచి 336కు పెరిగిన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ)

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది.. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింది. బుధవారం ఉదయానికి 336కు పెరిగింది.

Delhi Air Pollution (Photo Credit: ANI)

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది.. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింది. బుధవారం ఉదయానికి 336కు పెరిగింది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (SAFAR)- ఇండియా ఈ వివరాలను వెల్లడించింది. కాగా పంజాబ్‌ రాష్ట్రంలోని రైతులు తమ పంట పొలాల్లో కొయ్య కాలు కాల్చివేత (స్టబుల్‌ బర్నింగ్‌) కారణంగా వెలువడే దట్టమైన పొగలు ఢిల్లీ వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం గాలిలో తేమకు ఈ పొగ తోడు కావడంతో కాలుష్యం పెరుగుతోంది. దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement