Delhi Air Pollution: ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం, బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధించిన ఆప్ సర్కారు, చలికి తోడు భారీగా పేరుకుపోతున్న పొగమంచు
దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. కాగా గత రెండు రోజులుగా ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతున్నది. చలికి తోడు భారీగా పొగమంచు పేరుకుపోతున్నది.ఫలితంగా వాయు కాలుష్యంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను అధికారులు కోరారు.వాయు కాలుష్యం మెరుగుపడితే ముందుగానే ఆంక్షలు సడలించనున్నట్లు పేర్కొన్నారు.
Here' s Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)