Delhi Excise Policy Case: వరుసగా ఆరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని ఆప్ స్పష్టం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన నేడు కూడా విచారణకు హాజరుకాలేదు.

Delhi Chief Minister Arvind Kejriwal (File Image)

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన నేడు కూడా విచారణకు హాజరుకాలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్న సమయంలో సమన్లు పంపడం చట్టు విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ వేచిచూడాల్సిందే అని పేర్కొంది.

ఈడీ పంపిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. కాగా కేజ్రీవాల్‌ను గతంలో ఐదుసార్లు నవంబర్ 2, నవంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపిస్తూ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now