Delhi Dog Attack: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ కుక్క, తలకు తీవ్ర గాయాలు, కుక్క యజమాని అరెస్ట్
ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన బాలుడి ఇంటి ముందు ఉన్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో బాలుడు బంతితో ఆడుకుంటూ బయటకు వస్తుండగా, పొరుగింటి పెంపుడు పిట్‌బుల్ అకస్మాత్తుగా వచ్చి అతనిపైకి దూకిన దృశ్యాలు కనిపిస్తున్నాయి
ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన బాలుడి ఇంటి ముందు ఉన్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో బాలుడు బంతితో ఆడుకుంటూ బయటకు వస్తుండగా, పొరుగింటి పెంపుడు పిట్‌బుల్ అకస్మాత్తుగా వచ్చి అతనిపైకి దూకిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుక్క అతని తల భాగాన్ని గట్టిగా కొరకడంతో పాటు, చెవిని కూడా తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది.
ఈ భయానక దాడి తర్వాత బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు, వైద్య నివేదికల ఆధారంగా, ప్రేమ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు పిట్‌బుల్ యజమానిని అరెస్ట్ చేసినట్లు NDTV సమాచారం వెల్లడించింది. దాడికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి ANIకి మాట్లాడుతూ నా దుకాణం దగ్గర ఆడుకుంటున్న ఆ పిల్లవాడిపై కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఇలాంటి ఘటనలు ఇదివరకూ కూడా చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం బాలుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని వివరించారు.
Pitbull Attacks 6-Year-Old Boy in Prem Nagar
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)