Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు, సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఐదవసారి సమన్లు జారీ చేసిన ఈడీ, ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని స్పష్టం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదవ సారి సమన్లు జారీ చేసి, ఫిబ్రవరి 2న విచారణలో పాల్గొనాల్సిందిగా కోరింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదవ సారి సమన్లు జారీ చేసి, ఫిబ్రవరి 2న విచారణలో పాల్గొనాల్సిందిగా కోరింది. జనవరి 18న స్కిప్ చేసిన నాల్గవ సమన్లను అనుసరించి ఢిల్లీ సీఎంకు తాజా సమన్లు వచ్చాయి. జనవరి 18, జనవరి 3, నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో ED జారీ చేసిన నాలుగు సమన్లను కేజ్రీవాల్ ఇప్పటివరకు "చట్టవిరుద్ధం" అంటూ దాటవేశారు. రాజకీయ కుట్రలో భాగమే ఈ నోటీసులు అని తెలిపారు. అక్రమ మద్యం పాలసీ కేసులో పాలసీ రూపకల్పన, ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచం ఆరోపణలు వంటి అంశాలపై ఈ కేసులో కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఈడీ కోరుతోంది. వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా, ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని ఆరోపణలు
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)