Delhi Fire: అతనే తగలబెట్టేశాడా.. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, పూర్తిగా మంటల్లో కాలిపోయిన 20 కార్లు, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓ బ‌హుళ అంత‌స్తులో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ అగ్నిప్ర‌మాదంలో 20 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున ఢిల్లీలోని సుభాష్ న‌గ‌ర్‌లో జ‌రిగిన‌ట్లు అగ్నిమాప‌క శాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.

Fire (Image Credits: Twitter)

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓ బ‌హుళ అంత‌స్తులో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ అగ్నిప్ర‌మాదంలో 20 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున ఢిల్లీలోని సుభాష్ న‌గ‌ర్‌లో జ‌రిగిన‌ట్లు అగ్నిమాప‌క శాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. అయితే తెల్ల‌వారుజామున ఆ భ‌వ‌నం సెల్లార్‌లో ఓ వ్య‌క్తి తిరుగుతున్న‌ట్లు సీసీ ఫుటేజీలో ల‌భ్య‌మైంది.ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌న్నారు. మొత్తం 20 కార్లు ద‌గ్ధ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు. అయితే ఈ భ‌వ‌నానికి ఫైర్ సేఫ్టీ స‌ర్టిఫికెట్ లేద‌ని ధృవీక‌రించారు.

Here's Fire Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement