Delhi Liquor Scam Case: కేజ్రీవాల్ జూన్ 2న కోర్టులో లొంగిపోవాల్సిందే, గెలిస్తే జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదన్న ఢిల్లీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు
ప్రజలు ఓటు వేస్తే జూన్ 2న తిరిగి తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు కేవలం ఆయన ఊహ మాత్రమేనని... తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వమని, కాబట్టి ఆయన మాట్లాడిన అంశంపై చెప్పడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రజలు ఓటు వేస్తే జూన్ 2న తిరిగి తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు కేవలం ఆయన ఊహ మాత్రమేనని... తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వమని, కాబట్టి ఆయన మాట్లాడిన అంశంపై చెప్పడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయన ఎప్పుడు లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందని తెలిపింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశమని... చట్టపాలన దీని ఆధారంగానే సాగుతుందన్నారు. ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఈడీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తాను గెలిస్తే జైలుకు వెళ్లనని ఎలా చెబుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)