Dengue Cases Rise in Delhi: దేశ రాజధానిలో పంజా విప్పిన డెంగ్యూ, వారంలోనే భారీగా పెరిగిన కేసులు, 348కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు కేవలం ఏడు రోజుల్లో 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన మొత్తం డెంగీ కేసుల సంఖ్య 348కి చేరింది. 2018 నుంచి ఇప్పటివరకు గడిచిన ఐదేండ్లలో ఆగస్టు 6 నాటికే డెంగీ కేసుల సంఖ్య 175 దాటడం ఇదే తొలిసారి.

ఆగస్టు 6 నాటికి 2018లో 64 కేసులు, 2019లో 47 కేసులు, 2021లో 55 కేసులు నమోదు కాగా 2020లో కేవలం 35 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2022లో అధికంగా అంటే 174 కేసులు కాగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 348 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు తొలి వారానికే డెంగీ కేసుల సంఖ్య 348 కి చేరడం ఆందోళన కలిగిస్తోందని ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)