Delhi Shocker: ఢిల్లీలో బాలుడిని కూడా వదలని కామాంధులు, దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి ప్రైవేట్ పార్టులపై కర్రలతో దాడి, చావుబతుకుల మధ్య బాలుడు

దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడి ప్రైవేట్ పార్టులపై కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు.

Boy. Representational Image. (Photo Credits: Pixabay)

దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడి ప్రైవేట్ పార్టులపై కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు.ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు.

ఢిల్లీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదు అని మండిపడ్డారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై మహిళా ప్యానెల్‌ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement