Delhi Shocker: ఢిల్లీలో కాలుష్యం పెరిగింది, ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎంతో మాట్లాడాలంటూ హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి ఓ వ్యక్తి నిరసన
ఢిల్లీలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడేందుకు తనను అనుమతించాలంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.

బుధవారం ఉదయం పది గంటల సమయంలో ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలోని హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఒక వ్యక్తి ఎక్కాడు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు. దేశ రాజధానిలో గాలి, నీటి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది.తాను టీచర్ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్, ఆ తర్వాత బీహార్‌కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు. అయితే అతడు ఏ ప్రాంతం వాడు, ఎందుకు ఇలా చేశాడన్న దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
Here's ANI Video