Delhi: రణరంగంగా మారిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల తీవ్ర ఘర్షణ, ముగ్గురికి గాయాలు, వీడియో ఇదిగో..
స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్ద ఎలక్షన్ కమిటీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కొట్లాటలో కొందరు వ్యక్తులు గాయపడ్డారు. ఓ వ్యక్తి గుంపుపై సైకిల్ విసిరేసిన వీడియో కూడా రిలీజైంది.
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ(Students Clash) తలెత్తింది. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్ద ఎలక్షన్ కమిటీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కొట్లాటలో కొందరు వ్యక్తులు గాయపడ్డారు. ఓ వ్యక్తి గుంపుపై సైకిల్ విసిరేసిన వీడియో కూడా రిలీజైంది. వర్సిటీకి చెందిన సెక్యూర్టీ అడ్డుకున్నా.. కొందరు వ్యక్తులు తీవ్ర ఘర్షణకు దిగారు. ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఆ ఘటనలో దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)