Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, 5 రోజుల సీబీఐ కస్టడికీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మార్చి 4 వరకు రిమాండ్

ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది.సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Delhi Deputy Chief Minister Manish Sisodia (Photo Credits: IANS)

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచింది సీబీఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది.సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియాను ఆదివారం 8 గంటలపాటు ప్రశ్నించింది సీబీఐ. అనంతరం ఆయనను అరెస్టు చేసింది. ఈ చర్యను ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. సిసోడియాకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరనసలు చేపట్టింది.ఈ క్రమంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.

Here's ANI Tweet