Devotees Playing with Snakes: వీడియో ఇదిగో, వందలాది విషపూరిత పాములు మెడలో వేసుకుని పూజారులు ఊరేగింపు, వారిని కాటేయకపోవడమే ఆ పండగ ప్రత్యేకత..
బీహార్‌లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరుగుతుంటాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ బ్లాక్‌లోని అగార్పుర్ గ్రామస్థులు పాములను మెడలో వేసుకుని వాటితో ఆడుకుంటారు.
బీహార్‌లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరుగుతుంటాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ బ్లాక్‌లోని అగార్పుర్ గ్రామస్థులు పాములను మెడలో వేసుకుని వాటితో ఆడుకుంటారు. భగత్ అని పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని ఓ నీటి కుంట నుంచి వందల విషపూరిత పాములను బయటకు తీస్తారు. మంత్రాలు ఉచ్ఛరిస్తూ పాములను తీసి.. వాటితో విన్యాసాలు చేస్తారు. మెడకు చుట్టుకొని ఆడిస్తారు. ఇలా వెళ్లింది..అలా పామును పట్టేసింది..వీడియో వైరల్
1981లో ఇక్కడ భగవతి స్థాన్ అనే మందిరం ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి గ్రామానికి ఎలాంటి సమస్య రాలేదని స్థానికులు చెబుతున్నారు. పాములను పట్టుకునే సంప్రదాయాన్ని గ్రామ భగత్(పూజారి) ప్రారంభించారని తెలిపారు. ఇక నాలుగు వందల ఏళ్లుగా ఇక్కడ స్నేక్ ఫెయిర్ నిర్వహించుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు.అయితే, ఒకే ప్రాంతం నుంచి వందల సంఖ్యలో పాములు ఎలా బయటకు వస్తున్నాయనే విషయం ఇప్పటికీ అంతుపట్టని విషయం. ఈ పాములు భక్తులను కాటేయకపోవడం కూడా ఆశ్చర్యకరమే.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)