Air India Fined: ఎయిర్‌ ఇండియాకు రూ.రూ.1.10 కోట్ల జరిమానా విధించిన డీజీసీఎ, భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘనపై ఇది రెండో సారి..

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (Air India)కి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (Directorate General of Civil Aviation) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. భద్రతకు సంబంధించిన నిబంధనలు (safety-related violations) ఉల్లంఘించినందుకు గానూ ఈ భారీ జరిమానా విధించింది

Air India Representational Image (File Photo)

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (Air India)కి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (Directorate General of Civil Aviation) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. భద్రతకు సంబంధించిన నిబంధనలు (safety-related violations) ఉల్లంఘించినందుకు గానూ ఈ భారీ జరిమానా విధించింది. ఎయిర్‌ ఇండియా ఉద్యోగి నుంచి అందిన ఫిర్యాదు మేరకు డీజీసీఏ చర్యలకు ఉపక్రమించింది. ఆ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ జరిమానా విధించడం వారంలో ఇది రెండోసారి. గత గురువారం కూడా ఎయిర్‌ ఇండియా సంస్థకు డీజీసీఏ పైలట్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా వేసింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now