CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా, అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి, సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నాడని వెల్లడి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదైంది.

CM Revanth Reddy on Allu Arjun Arrest (Photo-Video Grab/X)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదైంది. కోమాలో నుంచి ఆ బాబు బయటకు వస్తే వాళ్ల అమ్మ కనిపించదు. సినిమా హీరోది వ్యాపారం. డబ్బులు పెట్టాడు.. వసూలు చేసుకున్నాడు. ఇందులో ఇచ్చిపుచ్చుకునేందుకు ఏముంది?. నేను తీసుకునేది ఏముంది?’’ అంటూ ప్రశ్నించారు.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం

‘‘కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావుడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.. కంట్రోల్ కాలేదు. అందుకే అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పోలీసులు చేర్చారు. హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్ నాకు తెలుసు. చనిపోయిన మహిళ కుమారుడు ఇంకా కోమాలో ఉన్నాడు. సినిమా కోసం డబ్బులు పెట్టారు.. పైసలు సంపాదించారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు.’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy Comments on Allu Arjun Arrest

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement