Dindigul Hospital Fire: వీడియో ఇదిగో. ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం, మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మంటల్లో సజీవ దహనం
తమిళనాడు దిండుక్కల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దిండుక్కల్-తిరుచ్చి రహదారిలో నాలుగు అంతస్తుల్లో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి.
తమిళనాడు దిండుక్కల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దిండుక్కల్-తిరుచ్చి రహదారిలో నాలుగు అంతస్తుల్లో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని నిమిషాల్లో అవి ఆసుపత్రంతా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.ప్రమాదాన్ని గుర్తించిన కొంతమంది లిఫ్టులో కిందికి వచ్చేందుకు ప్రయత్నించారు. లిఫ్టు కదలకపోవడంతో అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మగవారు, ముగ్గురు మహిళలు, మూడేళ్ల వయసున్న చిన్నారి ఉన్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి, ట్రేడింగ్‌లో కొడుక్కి నష్టాలు రావడంతో గడ్డి మందు తాగిన కుటుంబం..నలుగురు మృతి
7 Burnt to Death in Blaze at City Hospital in Tamil Nadu