DK Shivakumar: కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యాచారం వ్యాఖ్యలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇలాంటి పదాలు ఎప్పుడూ పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడి

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన అత్యాచార వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా దీనిపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికె శివకుమార్ స్పందించారు.

DK Shivakumar (Photo Credits: PTI)

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన అత్యాచార వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా దీనిపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికె శివకుమార్ స్పందించారు. మా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చింతిస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ అత్యాచారం అనివార్యమైతే పడుకుని ఎంజాయ్ చేయండని వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement