LPG Cylinder Price Hike: మళ్లీ బాదుడు షురూ, రూ.50 పెరిగిన డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర, పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి..

వంటగ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరతో కలుపుకుని ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1053కి చేరుకుంది.

Commercial LPG Cylinder Price Hiked by Rs 266 (Photo-Representative Image)

వంటగ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరతో కలుపుకుని ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1053కి చేరుకుంది. అలాగే, 5 కేజీల సిలిండర్ ధరపై రూ. 18 పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 8.50 తగ్గించింది. కాగా, జులై 1న ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 198 తగ్గగా, జూన్‌ 1న ఇదే సిలిండర్‌ ధర రూ.135 తగ్గింది. ఏప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.250 పెరగడంతో దాని ధర రూ. 2,253కి పెరిగింది.

హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.18 పెరిగింది. అయితే 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను కేంద్రం మళ్లీ తగ్గించింది. తాజాగా సిలిండర్‌పై రూ.8.50 కోతవిధించింది. ఈ నెల 1న వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.198 తగ్గించిన విషయం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement