Manmohan Singh Covid: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌‌కు కరోనా, ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స, ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స్

మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. సోమవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్‌గా (Manmohan Singh Covid) తేలింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు.

File image of former Prime Minister Dr Manmohan Singh | (Photo Credits: PTI)

కాగా భారత్‌లో కరోనా వైరస్ వేగంగా అత్యంత వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయిదు సూచనలు చేస్తూ ఓ లేఖను రాశారు. కరోనా నియంత్రణకు తీసుకొనే చర్యలతో పాటు.. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతం చేయాలని కోరారు.. తన సలహాలు, సూచనలను నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో స్వీకరించాలని పేర్కొన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now