Drug Bust in Gujarat: గుజరాత్‌లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నేవీ, 5గురు పాకిస్తాన్ జాతీయులు అరెస్ట్, దేశంలోనే అతిపెద్ద డ్రగ్ ఆపరేషన్ ఇదే అని తెలిపిన ఎన్‌సిబి
నావికాదళం ప్రకారం, ఈ ఆపరేషన్ దేశంలోనే అతిపెద్ద డ్రగ్ సీజ్‌గా గుర్తించబడింది. ఒక చిన్న నౌకను నౌకాదళం అడ్డగించడంతో మంగళవారం ఈ ఆపరేషన్ జరిగింది.
భారత నావికాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఒక ముఖ్యమైన ఉమ్మడి భారీ ఆపరేషన్‌లో గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో ఓడ నుండి సుమారు 3,300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నావికాదళం ప్రకారం, ఈ ఆపరేషన్ దేశంలోనే అతిపెద్ద డ్రగ్ సీజ్‌గా గుర్తించబడింది. ఒక చిన్న నౌకను నౌకాదళం అడ్డగించడంతో మంగళవారం ఈ ఆపరేషన్ జరిగింది. వాటిలో 3,089 కిలోల చరస్, 158 కిలోల మెథాంఫెటమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నాయి. ఆ షిప్‌లో ఉన్న అయిదుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు. పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పోరుబందర్ తీరం వద్ద తిరుగుతున్న అనుమానిత షిప్‌ను గుర్తించారు.
ఆ షిప్‌లో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నేవీ అధికారులు భావించారు.తదుపరి విచారణ జరగుతోందని అధికారులు తెలిపారు. దీనిపై హోమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్‌సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 3132 కిలోల భారీ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మన దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చడానికి మన ప్రభుత్వం యొక్క తిరుగులేని నిబద్ధతకు ఈ చారిత్రక విజయం నిదర్శనం. ఈ సందర్భంగా ఎన్‌సీబీ, నావికాదళం, గుజరాత్ పోలీసులను అభినందిస్తున్నానని తెలిపారు. కొన్ని రోజుల క్రితం పుణెలో సుమారు 2500 కోట్లు ఖరీదు చేసే 1100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే.
Here's Home Minister Tweet
Here's Spokesperson Navy Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)