Earthquake in Gujarat: వరుస భూకంపాలతో గుజరాత్‌లో మళ్లీ డేంజర్‌బెల్స్, వారంలో 5 సార్లు భూప్రకంపనలు, నిన్న ఒక్కరోజే రెండు సార్లు కంపించిన భూమి

గుజరాత్‌ రాష్ట్రాన్ని వరుసగా స్వల్ప భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3:21 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో రాజ్‌కోట్‌ (Rajkot) ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్‌(Rajkot) కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Gandhi Nagar, Feb 27: గుజరాత్‌ రాష్ట్రాన్ని వరుసగా స్వల్ప భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3:21 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో రాజ్‌కోట్‌ (Rajkot) ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్‌(Rajkot) కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా, ఆ రాష్ట్రాన్ని సోమవారం ఉదయం మరో రెండు భూకంపాలు వణికించాయి.కచ్‌ (Kutch), అమ్రేలి (Amreli) ప్రాంతాల్లో రిక్టరు స్కేలు (Richter Scale)పై 3.8, 3.3 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి.

అమ్రేలిలో గత వారం రోజుల్లోనే 3.1, 3.4 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించడం ఇది ఐదోసారి.2001 సంవత్సరంలో కచ్‌లో సంభవించిన భూకంపానికి సుమారు 13,800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 1.67 లక్షల మంది గాయపడ్డారు. తాజా భూకంపంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Mystery Illness in Congo: ఆ దేశాన్ని వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి, ఇప్పటికే 50 మందికి పైగా మృతి, వందల్లో బాధితులతో నిండిన ఆస్పత్రులు

New Ration Cards: కొత్త రేషన్‌ కార్డుల కోసం అప్లై చేశారా? ఫిబ్రవరి 28వ తేదీనే లాస్ట్ డేట్, మార్చి మొదటివారంలో కొత్త కార్డుల పంపిణీ షురూ

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Share Now