Earthquake in Jammu and Kashmir: వరుస భూకంపాలతో వణుకుతున్న జమ్ముకశ్మీర్‌, నిన్న దోడా, నేడు కత్రాలో భారీ భూకంపాలు

మంగళవారం దోడా (Doda) కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా (Katra) కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir)వరుస భూకంపాలతో వణుకుతోంది. మంగళవారం దోడా (Doda) కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా (Katra) కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 లోతులో ప్రకంపణలు సంభవించాయని పేర్కొంది.

కశ్మీర్‌లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌‌, హర్యానా, పంజాబ్‌, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)