Earthquake in Karnataka: కర్ణాటకను కుదిపేసిన భూకంపం, పరుగులు పెట్టిన ప్రజలు, బెంగళూరులో రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 3.3గా నమోదు

కర్నాట‌క రాజ‌ధాని బెంగుళూరులో ఇవాళ స్వ‌ల్ప స్థాయిలో భూకంపం వ‌చ్చింది. ఉత్తర, ఈశాన్య బెంగళూరులో భూప్రకంపనలు జనాలను వణికించాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 3.3గా ఉంది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సెసిమాల‌జీ ఈ విష‌యాన్ని త‌న ట్వీట్‌లో తెలిపింది.

Earthquake of Magnitude

కర్నాట‌క రాజ‌ధాని బెంగుళూరులో ఇవాళ స్వ‌ల్ప స్థాయిలో భూకంపం వ‌చ్చింది. ఉత్తర, ఈశాన్య బెంగళూరులో భూప్రకంపనలు జనాలను వణికించాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 3.3గా ఉంది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సెసిమాల‌జీ ఈ విష‌యాన్ని త‌న ట్వీట్‌లో తెలిపింది. ఇవాళ ఉద‌యం 7.14 నిమిషాల‌కు భూకంపం సంభ‌వించిన‌ట్లు ఎన్ఎస్సీ పేర్కొన్న‌ది. భూకంప కేంద్రం భూమికి 23 కిలోమీటర్ల లోతున ఉందని చెప్పింది. భూప్రకంపనలతో ఉలిక్కి పడిన జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత మళ్లీ ఇళ్లలోకి అడుగుపెట్టారు.

ఇవాళ రెండు సార్లు క‌ర్నాట‌క‌లో భూకంపం సంభ‌వించింద‌ని, ఓసారి 2.9, మ‌రోసారి 3.0 తీవ్ర‌తతో భూ ప్ర‌క‌పంన‌లు చోటుచేసుకున్న‌ట్లు క‌ర్నాట‌క రాష్ట్ర నేచుర‌ల్ డిజాస్ట‌ర్ మానిట‌రింగ్ సెంట‌ర్ తెలిపింది. అయితే రెండు సార్లు చికబ‌ల్లాపూర్ జిల్లాలో ఆ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు డిజాస్ట‌ర్ మానిట‌రింగ్ సెంట‌ర్ తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement