Earthquake in Maharashtra: మహారాష్ట్రలో నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు, భయంతో వణికిపోయిన ప్రజలు, వీడియో ఇదిగో..

గురువారం ఉదయం కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.హింగోలి (Hingoli) నగరంలో గురువారం ఉదయం 10 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలిపింది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

మహారాష్ట్ర (Maharashtra)ను వరుస భూకంపాలు (Earthquakes) చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.హింగోలి (Hingoli) నగరంలో గురువారం ఉదయం 10 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలిపింది.

ముందుగా ఉదయం 6:08 గంటల సమయంలో మొదటి సారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. ఆ తర్వాత 6:19 గంటలకు రెండో సారి భూమి కంపించింది. అప్పుడు రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)