Earthquake in Punjab: పంజాబ్‌లో స్వల్ప భూకంపం, తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు, బటిండాకు 231 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం

శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో బటిండాలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. బటిండాకు 231 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది.

Earthquake measuring 5.0 hits Nicobar Islands, no casualties reported Representational Image | Photo- Pixabay

పంజాబ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో బటిండాలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. బటిండాకు 231 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 92 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. కాగా, భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)