Delhi Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం, కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు, రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదు

మంగళవారం పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీశారు జనాలు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌ ప్రాంతంలో భూకంప కేంద్ర నమోదు అయ్యింది

Earthquake (Photo-ANI)

దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీశారు జనాలు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌ ప్రాంతంలో భూకంప కేంద్ర నమోదు అయ్యింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్‌ పరిధిలో మధ్యాహ్నం 2.30 గం. ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. జనం బయటకు పరుగులు తీయగా, మరికొందరు ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)