Money laundering Case: ఆమ్ ఆద్మీకి మరో షాక్, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఈడీ సోదాలు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలకు మరో షాక్‌ తగిలింది. తాజాగా ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) తనిఖీలు చేపట్టింది.అమానతుల్లా ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది.

ED conducts raid at AAP MLA Amanatullah Khan's premises (Photo/ANI)

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలకు మరో షాక్‌ తగిలింది. తాజాగా ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) తనిఖీలు చేపట్టింది.అమానతుల్లా ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆప్‌ ఎమ్మెల్యే మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నది.

మరోవైపు, ఈడీ సోదాలపై ఆప్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, సంజయ్‌ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజులు ఈడీ కస్టడీని విధించింది. దీంతో, లిక్కర్‌ స్కాం గురించి సంజయ్‌ సింగ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now