Rahul Gandhi Panauti Remark: ప్రధాని మోదీపై పనౌతీ, పిక్‌ పాకెటర్‌ వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకీ నోటీసులు జారీ చేసిన ఈసీ, ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు

ఈ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Congress leader Rahul Gandhi takes dig at PM Narendra Modi after India's World Cup loss to Australia, BJP hits back (Photo-X)

ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమి నేపథ్యంలో మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఫైనల్‌ సందర్బంగా మోదీ స్టేడియంకు వెళ్లడం వల్లే టీమిండియా ఓడిపోయిందని రాహుల్‌ అన్నారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీని అపశకునంగా రాహుల్‌ పోల్చారు. ఈ క్రమంలో మోదీని పనౌతీ, పిక్‌ పాకెటర్‌ అంటూ రాహుల్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో, రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం, ఈసీ.. రాహుల్‌కు నోటీసులు పంపింది. రాహుల్‌ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Congress leader Rahul Gandhi takes dig at PM Narendra Modi after India's World Cup loss to Australia, BJP hits back (Photo-X)

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు