Excise Policy Case: కేజ్రీవాల్‌కు మళ్లీ షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు, జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Excise Policey) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకూ పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకూ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Excise Policey) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకూ పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకూ కోర్టు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దర్నీ కోర్టు ముందు హాజరుపరిచారు.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. గోవా ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేత కె.కవిత నుంచి అభిషేక్ బోయనపల్లి ద్వారా రూ.25 కోట్లు వినోద్ చౌహాన్ అందుకున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెలాఖరులోగా వినోద్ చౌహాన్‌పై ప్రాసిక్యూషన్ కంప్లయింట్ నమోదు చేయనున్నట్టు చెప్పారు. వినోద్ చౌహాన్‌ను మేలో అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు, వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)