Fahadh Faasil in ‘Pushpa 2–The Rule’: పుష్ప-2 నుంచి అదిరిపోయే అప్‌డేట్, మాస్ లుక్‌లో అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బర్త్‌డే సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బర్త్‌డే సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పుష్ప చిత్రంలో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ పోలీస్ అధికారి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఫహాద్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే విషెస్ చెబుతూ మూవీలోని ఆయన లుక్‌ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. వీడియో ఇదిగో, ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యింది, టాలీవుడ్ సినిమాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, ఆ హీరోని టార్గెట్ చేశారా..
ఈ పోస్టర్‌లో భన్వర్ సింగ్ గా మాస్ లుక్‌లో అదరగొట్టారు. షెకావత్ సార్ ఈసారి గుండీలు విప్పేసిన ఖాకీ చొక్కా వేసుకుని, లుంగీ కట్టి... ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. బన్నీ సరసన హీరోయిన్‌గా కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)