Farmers' Protest 2.0: ఢిల్లీ వైపు దూసుకెళ్లేందుకు ఒక్కచోటకు చేరుకున్న వేలాది మంది రైతులు, పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద హైటెన్సన్, వీడియో ఇదిగో..
ఇక పంజాబ్-హర్యానా శంబు సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో రైతులు తమ వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి తరలివెళ్లేందుకు రెడీ అయ్యారు.
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు నేడు ఢిల్లీ చలో’ మార్చ్ తలపెట్టిన సంగతి విదితమే. రైతుల నిరసనతో రాజధాని హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది.కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో ఏకంగా నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిరసన తెలిపే రైతులను ఆపడానికి ఢిల్లీ పోలీసు సిబ్బంది ఢిల్లీ-యుపి అప్సర సరిహద్దులో మోహరించారు. ఇక పంజాబ్-హర్యానా శంబు సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో రైతులు తమ వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి తరలివెళ్లేందుకు రెడీ అయ్యారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)