Hyderabad Fire: వీడియో ఇదిగో, హైదరాబాద్ నాంపల్లి పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, పరుగులు పెట్టిన స్థానికులు, నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత
హైదరాబాద్ నాంపల్లిలోని ఏక్‌మినార్ కూడలి వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ నింపడానికి హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ సమయంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు.

వీడియో ఇదిగో, గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు, భారీగా ఆస్తి నష్టం
అదే సమయంలో గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి అటు నుంచి వెళుతున్నారు. ఆమె చాకచక్యంగా మంటలు బంక్‌లో వ్యాపించకుండా ట్యాంకర్‌ను నిలువరించారు. అనంతరం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. పెట్రోల్ బంకుకు మంటలు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేదని హైదరాబాద్ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
Fire broke out in Hindustan Petroleum tank at a petrol station
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)