Flash Floods in Spain: వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న వీడియో ఇదిగో, స్పెయిన్ దేశాన్ని వణికించిన ఆకస్మిక వరదలు
స్పెయిన్‌లోని వాలెన్సియాలో సంభవించిన ఆకస్మిక వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. మరెంతోమంది గల్లంతయ్యారు. వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
స్పెయిన్‌లోని వాలెన్సియాలో సంభవించిన ఆకస్మిక వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. మరెంతోమంది గల్లంతయ్యారు. వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. గల్లంతయిన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు.
ఏఐ చాట్ బాట్ తో ప్రేమలో పడిన మైనర్ బాలుడు.. అనంతరం ఆత్మహత్య.. కోర్టుకెక్కిన తల్లి
వాలెన్సియాలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో స్కూళ్లు మూసివేశారు. క్రీడా కార్యక్రమాలను నిలిపివేశారు. 12 విమానాలను దారి మళ్లించగా, 10 విమానాలను రద్దు చేశారు. అండలూసియాలో 276 మంది ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Flash Floods in Spain:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)