Food Poisoning in Jharkhand: పానీ పూరీలతో జాగ్రత్త, కల్తీ చాట్ మసాలా తిని 80 మందికి అస్వస్థత, కడుపు నొప్పి, వాంతులతో ఆస్పత్రి పాలైన పిల్లలు

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో కల్తీ ‘చాట్ మసాలా’ తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Hospital beds | Representational Image (Photo Credits: Pixabay)

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో కల్తీ ‘చాట్ మసాలా’ తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కర్మతాండ్ పంచాయతీ పరిధిలోని భోక్తాలో జాతర జరిగింది.ఈ సందర్భంగా హుచుక్తాన్‌ధాడ్ గ్రామానికి చెందిన సుమారు 80 మంది కల్తీ ‘చాట్ మసాలా’ తిని అనారోగ్యం పాలయ్యారు. జాతర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కలుషిత ఆహారం వల్ల వారంతా కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో రాత్రి 10.30 గంటలకు వారిని షాహిద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement