Grandhi Srinivas Resigns: వైసీపీని వీడిన మరో కీలక నేత, పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించిన ఘనత గ్రంధి శ్రీనివాస్ కు ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ పై ఆయన విజయం సాధించారు. తద్వారా పార్టీలో జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
Grandhi Srinivas Resigns to YSRCP
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement