Vij, Dec 12: ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ, పదవులకు రాజీనామా చేసిన ఆయన...తన రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.
ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన అవంతి...వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలని నిర్ణయించుకోలేదని.... తనకు ఎక్కడ గౌరవం లభిస్తుందని అనుకుంటే అటువైపు వెళ్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది, మరి ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన వైఎస్ జగన్
రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని...వైసీసీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదన్నారు. పార్టీలో కార్యకర్తలు, నాయకులకు గౌరవం కొరవడిందన్నారు. జమిలి ఎన్నికల నేపథ్యంలో ధర్నాలు చేయమంటున్నారని ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తన రాజీనామాను ఆమోదించవలసినగా కోరుతున్నానంటూ జగన్ ను కోరారు