Free COVID Booster Dose: ఈనెల 15 నుంచి ఉచితంగా బూస్టర్ డోస్‌లు, 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపిన కేంద్రం

కరోనా బూస్టర్ డోసులపై కేంద్రం శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోస్‌లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూలై 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బూస్టర్ డోస్‌లు వేయించుకోవచ్చని తెలిపింది.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

కరోనా బూస్టర్ డోసులపై కేంద్రం శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోస్‌లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూలై 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బూస్టర్ డోస్‌లు వేయించుకోవచ్చని తెలిపింది. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్న తరుణాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) బుధవారంనాడు తెలిపారు. ఈనెల 15 నుంచి రాబోయే 75 రోజుల పాటు 18 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఉచితంగా బూస్టర్ డోస్ తీసుకోవచ్చని మంత్రి చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement