Fuel Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు, 8 రోజుల్లో ఏడు సార్లు పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, తాజాగా లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు పెంచిన చ‌మురు సంస్థ‌లు

దేశ వ్యాప్తంగా గ‌డిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. ఇవాళ లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 113.61 కాగా, డీజిల్ ధ‌ర రూ. 99.83గా ఉంది.

Road Development Cess In AP | Representational Image | (Photo Credits: PTI)

దేశ వ్యాప్తంగా గ‌డిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. ఇవాళ లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 113.61 కాగా, డీజిల్ ధ‌ర రూ. 99.83గా ఉంది. విజ‌య‌వాడ‌లో పెట్రోల్ రూ. 115.37, డీజిల్ రూ. 101.23గా ఉంది. ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.21, డీజిల్ ధ‌ర రూ. 91.47, ముంబైలో పెట్రోల్ రూ. 115.04, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.94, డీజిల్ ధ‌ర రూ. 96, కోల్‌క‌తాలో లీట‌ర్ పెట్రోల్ రూ. 109.68, డీజిల్ ధ‌ర రూ. 94.62గా ఉంది.

ఇంధన ధరల పెంపును ఉప‌సం‌హ‌రిం‌చు‌కో‌వా‌లని, ఈ అంశంపై ప్రధాని మోదీ పార్ల‌మెం‌ట్‌లో ప్రక‌టన చేయా‌లని ప్రతి‌ప‌క్షాలు నిన్న డిమాండ్‌ చేశాయి. ధరల పెరు‌గు‌ద‌లకు రష్యా–‌ఉ‌క్రె‌యిన్‌ యుద్ధమే కార‌ణ‌మన్న ప్రభుత్వ వాద‌నను తోసి‌పు‌చ్చాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement