'Gangajal is Exempt Under GST': గంగా జలంపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదు, కాంగ్రెస్ ఆరోపణలపై స్పష్టత నిచ్చిన కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు
మోదీ సర్కారు గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణకు దిగిన సంగతి విదితమే. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది
మోదీ సర్కారు గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణకు దిగిన సంగతి విదితమే. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది.ఈ గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని సీబీఐసీ పేర్కొంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని క్లారిటీ ఇచ్చింది.
కాగా ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం గంగాజలం గురించి ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఉత్తరాఖండ్‌లో ఇవాళ మీరు పర్యటిస్తున్నారు. కానీ మీ ప్రభుత్వం ఇదే గంగాజలానికి 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇంట్లో పెట్టుకునే పవిత్ర గంగా జలానికీ జీఎస్టీ విధించడం తగదు’’ అంటూ ఖర్గే పోస్ట్ పెట్టారు.
Here's Updates
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)