Gautam Lal Meena Dies: బీజేపీ ఎమ్మెల్యే గౌతమ్‌ లాల్‌ మీనా కరోనాతో కన్నుమూత, ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

రాజస్థాన్‌ ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని ధారివాడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత గౌతమ్‌ లాల్‌ మీనా (56) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఆయనను ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం మృతి చెందారు.

Gautam Lal Meena (Photo-ANI)

ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యే మృతికి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, గులాబ్‌ చంద్‌ కటారియా సంతాపం ప్రకటించారు. ఇంతకు ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కైలాష్‌ త్రివేది, గజేంద్ర శక్తివత్‌, బీజేపీ ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్వరి కరోనా సోకి మృతి చెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement