MLA Geeta Jain Slaps Jr Engineer Video: వీడియో ఇదిగో, ఇంజినీరు చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే, అక్రమనిర్మాణాల కూల్చివేత సందర్భంగా మహారాష్ట్రలో ఘటన

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానే జిల్లా మీరా భయందర్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు.

MLA Geeta Jain Slaps Jr Engineer Video (Photo-Video Grab)

మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందు ఓ ఇంజినీరు చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానే జిల్లా మీరా భయందర్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. వీటి కూల్చివేతతో వర్షంలో చిన్నారులు, వృద్ధులు రోడ్డున పడ్డారంటూ మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ ఇద్దరు ఇంజినీర్ల శుభమ్ పాటిల్, సోనీపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న జూనియర్ సివిల్ ఇంజినీర్ శుభమ్ పాటిల్‌పై చేయిచేసుకున్నారు.వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆక్రమణల కూల్చివేతలో వారి తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే గీతా జైన్ తన చర్యను సమర్థించుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)