Ghaziabad: యూపీలో పెంపుడు కుక్కను ఢీకొట్టిన కారు...ఆ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.
ఘజియాబాద్ ఇందిరాపురంలో ఓ పెంపుడు కుక్కను SUV ఢీకొట్టిన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
ఘజియాబాద్ ఇందిరాపురంలో ఓ పెంపుడు కుక్కను SUV ఢీకొట్టిన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇందిరాపురంలో ఉంటున్న ఓ యువకుడు తన పెంపుడు కుక్కను వాకింగ్ కోసం రోడ్డు పై నుంచి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో అతను ఆ కుక్కను పట్టించుకోకుండా ఫోన్ లో లీనమైపోవడంతో అకస్మాత్తుగా అటుగా వచ్చిన కారు ఆ కుక్కను ఢీకొట్టింది. ఈ వీడియో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది.
దీంతో ఆ కుక్క తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన గురించి తెలుసుకొని ఆ కుక్క యజమాని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అతన్ని మీద కేసు పెట్టినట్లు తెలుస్తోంది..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)