Gujarat Gas Leak: సూరత్‌లో ఘోర ప్రమాదం, కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీక్, ఆరుగురు మృతి, మరికొందరికి తీవ్ర అస్వస్థత

కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు మృతి చెందారు. సూరత్​లోని సచిన్​ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్‌ లీక్‌ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది

Visuals from Hospital. (Photo Credits: ANI)

గుజరాత్ సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు మృతి చెందారు. సూరత్​లోని సచిన్​ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్‌ లీక్‌ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్​ మిల్​లో కార్మికులు ఈ పాయిజ్‌ గ్యాస్‌ను పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి పోన్ చేయడంతో.. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)