BSF Soldier Killing Case: జవాన్ హత్య కేసులో ఏడు మంది అరెస్ట్, బీఎస్ఎఫ్ జవాన్ కుమార్తె అశ్లీల వీడియోని డిలీట్ చేయమన్నందుకు దాడి చేసి చంపేసిన నిందితులు
గుజరాత్ | డిసెంబరు 24 న నదియాడ్‌లోని చక్లాసి గ్రామంలో జవాన్ కుమార్తె వీడియోను నిందితులలో ఒకరైన శైలేష్ జాదవ్ వైరల్ చేసిన తర్వాత వారి ఇంటికి వెళ్లిన BSF సైనికుడు మెల్జీభాయ్ వాఘేలాను చంపిన తరువాత ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని నదియాడ్ DSP VR బాజ్‌పాయ్ తెలిపారు.

శైలేష్ అనే యువకుడు మా అమ్మాయిని వీడియో తీసి వైరల్ చేసి పరారీలో ఉన్నాడు. మేము అతని కోసం 3 రోజులు వెతకడానికి వెళ్ళాము. మూడవ రోజు, మేము అతని కోసం వెతకడానికి వెళ్ళిన ప్రదేశంలో 7 మంది కూర్చున్నారు. నా భర్త నిందితుడి కోసం అడిగాడు కానీ అతను అక్కడ లేడని మరణించిన BSF జవాన్ భార్య తెలిపింది. మేము తిరిగి వస్తుండగా, నా భర్తను కొంతమంది చెక్క కర్రలతో కొట్టారు. అతను అక్కడికక్కడే మరణించాడు. విషయం సీరియస్‌గా మారిందని చూసి నన్ను కొట్టి, చేయి, కాళ్లు విరగ్గొట్టారని ఆమె తెలిపింది.
Here's ANI Tweets